Published : 03/12/2020 03:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్రామ, వార్డు మహిళా పోలీసులకు పోస్టింగ్‌లు

అభ్యర్థులకు పోస్టింగ్‌లు కేటాయిస్తున్న ఎస్పీ

చిత్తూరు నేరవార్తలు: గ్రామ, వార్డు మహిళా పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బుధవారం ఎస్పీ సెంథిల్‌కుమార్‌ పోస్టింగ్‌లను కేటాయించారు. జిల్లాలో 69 మంది ఎంపిక కాగా వారికి జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో కౌన్సెలింగ్‌ నిర్వహిం చారు. ఉద్యోగాల కోసం ఖాళీలను ప్రొజెక్టర్‌ ద్వారా ప్రదర్శించి అభ్యర్థులకు కోరుకునే అవకాశం కల్పించారు. అనంతరం అభ్యర్థులు సొంత ప్రాంతాల మినహా కోరుకున్న మిగిలిన ప్రాంతాలకు కేటాయించి పోస్టింగ్‌ ఆర్డర్లను అందించారు. ఏఎస్పీ మహేష్‌, ఏఆర్‌ డీఎస్పీ కృష్ణమోహన్‌, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని