
‘బురేవి’పై అప్రమత్తం
పోలీసులతో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు
సిబ్బందికి సూచనలిస్తున్న ఏఎస్పీ ఆరిఫుల్లా
శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: బురేవి తుపాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారు. శ్రీకాళహస్తి డీఎస్పీ కార్యాలయ ఆవరణలో బుధవారం ఇక్కడి పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఇకపై ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో ఎంపిక చేసిన పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాళహస్తి సబ్‌డివిజన్ పరిధిలో 22 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చామన్నారు. రానున్న తుపాన్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా తీవ్రత పూర్తిగా తగ్గే వరకు ప్రజలందరూ విధిగా మాస్కును ధరించాలని, భౌతికదూరాన్ని పాటించాలని కోరారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ఉపకరణాలను అందజేశారు. డీఎస్పీ విశ్వనాథ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.