Published : 18/01/2021 03:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏనుగుల సమస్యపై అంతర్రాష్ట్ర సమావేశం

చిత్తూరు డీఎఫ్‌వో రవిశంకర్‌ వెల్లడి

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: ఏనుగుల సమస్యను పరిష్కరించే కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి త్వరలోనే అంతర్రాష్ట అధికారుల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చిత్తూరు డీఎఫ్‌వో రవిశంకర్‌ వెల్లడించారు. హార్సిలీహిల్స్‌లో అటవీ శాఖ ప్రాంగణాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఏనుగుల సంతతి పెరిగిపోయి జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయన్నారు. గజరాజుల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. పొరుగు రాష్ట్రాల అధికారులతో సమావేశమై తాజా పరిస్థితుల గురించి సమీక్షించి తదుపరి చర్యలు చేపడతామన్నారు. హార్సిలీహిల్స్‌లోని అటవీశాఖ ప్రాంగణంలో ఉన్న అతిథి గృహాల అద్దెలను పెంచాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఇకపై అటవీ శాఖ గదులను ఆన్‌లైన్లో బుక్‌ చేసుకునే వెసులుబాటును పర్యాటకులకు కల్పించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కొండపై ఉన్న అటవీ శాఖ ప్రాంగణం ప్రవేశ రుసుమును రెట్టింపు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కొండపై ఉన్న జంతు ప్రదర్శనశాలతో పాటు అతిథి గృహాల నిర్వహణకు అయ్యే ఖర్చుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా స్థానికంగానే సమకూర్చుకుంటామని వివరించారు. ఆయన వెంట డీఆర్‌వో మధుసూదన్‌, హార్సిలీహిల్స్‌ ఎఫ్‌బీఏ రాకేష్‌ కుమార్‌, తదితరులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని