Published : 18/01/2021 03:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రథమం.. ప్రారంభం

నేటి నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు

అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

ఈనాడు డిజిటల్‌, తిరుపతి

జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశాలకు గడువు ఆదివారంతో ముగిసింది. సోమవారం నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ విద్యామండలి క్యాలెండర్‌ను రూపొందించింది. విద్యార్థులకు బోధన పని దినాలు 106 రోజులుగా నిర్ణయించింది. జనవరి 18 నుంచి మార్చి 31 వరకు ఫస్ట్‌ టర్మ్‌ తరగతులు, మార్చి 25 నుంచి 31 వరకు ఆరు నెలల పరీక్షలు, ఏప్రిల్‌ 1 నుంచి మే 5 వరకు సెకండ్‌ టర్మ్‌ తరగతులు నిర్వహించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. తరగతులు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలి. జిల్లాలో 291 కళాశాలలు ఉన్నాయి. వీటిలో 60 వేల వరకు సీట్లు ఉండగా 50 వేల మంది పదో తరగతి ఉత్తీర్ణులయ్యారు. వీరికి ఆన్‌లైన్‌ ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆఫ్‌లైన్‌ ప్రవేశాలు చేపట్టింది. ఈ విషయమై తలెత్తిన వివాదాలతో విద్యా సంవత్సరం ఆలస్యమైంది. 30 శాతం సిలబస్‌ తగ్గించడంతో పాటు బోధన పని దినాలను ఖరారు చేశారు. వేసవి సెలవులు రద్దు చేశారు. మే 31తో విద్యా సంవత్సరం పూర్తి చేసి.. జూన్‌ 6న రెండో సంవత్సరం తరగతులు ప్రారంభించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది.

లెక్క తేలాల్సి ఉంది

ఆఫ్‌లైన్‌ ప్రవేశాల కారణంగా జిల్లాలో వివరాలు ఇంకా అందలేదు. సోమవారం నుంచి జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో ప్రవేశాలు నమోదు చేయాలని కళాశాలలను ఆదేశించారు. పని చేయని కళాశాలలు, ప్రవేశాలు లేని సంస్థలు ఉన్నాయి. వివరాలు రావాల్సి ఉంది. సిలబస్‌ 30 శాతం తగ్గించారు. వేసవి సెలవులు ఉండవు. ఒక్కో సెక్షన్‌కు 88 మందికి ప్రవేశాలు కల్పించాం. - శ్రీనివాసులురెడ్డి, ఆర్‌ఐవో, తిరుపతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని