Published : 18/01/2021 03:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాష్ట్రాభివృద్ధిలోముఖ్యమంత్రికి సహకారం

ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి

ఆలయం ఎదుట చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు

తిరుమల, న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులు సహకారం అందిస్తారని ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అందిస్తున్న సీఎం జగన్‌తో పనిచేస్తున్నందుకు ప్రభుత్వ ఉద్యోగులు సంతోషపడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగులకు ఇళ్లస్థలాలు, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను శాశ్వతం చేయడం, క్లాస్‌-4 ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపుపై సుముఖంగా ఉన్నారని చెప్పారు. ఆయనతోపాటు ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనంజయనాయుడు, తిరుపతి అధ్యక్షుడు సురేష్‌బాబు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని