
కారు ఢీకొని కార్మికుడి మృతి
మదనపల్లె నేరవార్తలు: కారు ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన మదనపల్లె గ్రామీణ మండలంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొత్తవారిపల్లె పంచాయతీ గాజులవారిపల్లెకు చెందిన వెంకటేష్(30) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి పని ముగించుకొని ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వస్తుండగా మదనపల్లె గ్రామీణ మండలం తిరుపతిరోడ్డులోని 5వ మైలు వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అయన్ను స్థానికులు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. మార్గమధ్యలోనే మృతి చెందాడు. రూరల్ ఎస్సై దిలీప్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags :