Published : 18/01/2021 03:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హామీలు నెరవేర్చండి

మాట్లాడుతున్న పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

మదనపల్లె విద్యావిభాగం: ఉపాధ్యాయ, ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానికంగా ఉన్న ఓ కల్యాణ మండపంలో ఎస్టీయూ జిల్లా శాఖ 74వ వార్షిక కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల విజయవంతంలో ఉద్యోగుల కృషి ఎంతో ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత త్వరగా నూతన పింఛన్‌ విధానం రద్దు చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కడియాల మురళి, జగన్మోహన్‌రెడ్డి, చంద్రన్‌, ముధుసూదన్‌, శ్రీదేవి, పురుషోత్తంనాయుడు, హేమచంద్రారెడ్డి, లోకనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని