Published : 18/01/2021 03:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తాళం వేసిన ఇంట్లో చోరీ

నగలు, నగదు అపహరణ

వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్‌టీం

మదనపల్లె నేరవార్తలు: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.7.30 లక్షల విలువ చేసే నగలు, నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి కథనం మేరకు.. పట్టణంలోని అమ్మచెరువు మిట్టకు చెందిన మల్లికార్జుననాయుడు వ్యాపారం చేస్తాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్దమండ్యంలోని బంధువుల గ్రామానికి కుటుంబ సభ్యులతో కలిసివెళ్లాడు. శనివారం రాత్రి తిరిగి మదనపల్లెకు వచ్చారు . ఇంటికి వచ్చే సరికే తాళం పగులగొట్టి ఉండటంతో అనుమానంతో వెళ్లి చూడగా ఇంట్లో దొంగలు పడి దోచుకెళ్లినట్లు గుర్తించారు. రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నరసింహులు, ఎస్సై వంశీధర్‌ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి చిత్తూరు క్లూస్‌టీంకు సమాచారం అందజేశారు. ఆదివారం క్లూస్‌టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఇంట్లో ఉంచిన రూ.2 లక్షల నగదు, 130 గ్రాముల బంగారు నగలు, 250 గ్రాముల లక్ష్మీదేవి వెండి విగ్రహం అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని