Published : 28/02/2021 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘స్కిట్’ భవితవ్యంపై పునఃసమీక్ష


సదస్సుకు హాజరైన వారితో మంత్రి ఆదిమూలపు సురేష్‌

శ్రీకాళహస్తి, ఏర్పేడు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో దేవాదాయ శాఖకు అనుబంధంగా ఉన్న ఏకైక ఇంజినీరింగ్‌ కళాశాల స్కిట్‌ భవితవ్యంపై మరో దఫా పునః పరిశీలన చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఏర్పేడు ఐఐటీ ప్రాంగణంలో శనివారం జరిగిన పలు విశ్వవిద్యాలయాల నిపుణుల సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏదైనా సంస్థ ఇంజినీరింగ్‌ కళాశాల పర్యవేక్షణ చేపట్టలేనప్పుడు ఆ బాధ్యత ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. స్కిట్‌ విషయానికి వస్తే ఆలయానికి సంబంధించి పాలకవర్గం కళాశాల భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఆ నిర్ణయం సరైనదా, కాదా అన్న విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. బీఏ, బీకాం, బీటెక్‌ కోర్సులకు పది నెలలుగా ఇంటర్న్‌షిప్‌ అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నైపుణ్యాభివృద్ధి సంస్థ కేంద్రాలు, తిరుపతిలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వివరించారు. బీఎడ్‌ కోర్సుకు సంబంధించి ప్రత్యేక విభాగాలతో నాలుగు సంవత్సరాలకు పెంచుతున్నట్లు వివరించారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి అధ్యక్షులు హేమచంద్రారెడ్డి, ఐఐటీ డైరెక్టర్‌ సత్యనారాయణతో పాటు వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన పలువురు నిపుణులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని