Published : 28/02/2021 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరో 170 గ్రామాల్లోపాల సేకరణ


వీసీలో హరినారాయణన్‌, జాహ్నవి

 

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: అమూల్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రెండో విడత కింద జిల్లాలో మరో 170 గ్రామాల్లో పాలసేకరణ చేపట్టనున్నట్లు కలెక్టరు హరినారాయణన్‌ వెల్లడించారు. నిమ్మనపల్లె మండలంలో 37, కురబలకోట 42, వాల్మీకిపురం 21, రామకుప్పం 11, వి.కోట 59 వంతున సేకరణ కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. శనివారం తిరుపతి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో కలెక్టరు సమీక్షిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం లీటరు పాలపై రూ.4 ప్రోత్సాహక ధర ఇస్తోందని, ఈ విషయంపై మహిళా పాడి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో పాల సేకరణ పర్యవేక్షణకు జిల్లా స్థాయి కోర్‌ కమిటీకి కలెక్టరు ఛైర్మన్‌గా, మదనపల్లె సబ్‌ కలెక్టరు, జేసీలు, ఆర్డీవోలు నోడల్‌ ఆఫీసర్లుగా, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు, పశుసంవర్ధకశాఖ జేడీ, డీసీవో, పీఆర్‌ ఎస్‌ఈలు సభ్యులుగా ఉంటారని వివరించారు. సబ్‌ కలెక్టరు జాహ్నవి, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు తులసి, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని