
ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా వాణీిమోహన్ ప్రమాణ స్వీకారం
వాణీమోహన్కు శ్రీవారి చిత్రపటాన్ని అందిస్తున్న ధర్మారెడ్డి
తిరుమల, న్యూస్టుడే: తితిదే ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీిషియో సభ్యురాలిగా రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జి.వాణిమోహన్ శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. అక్కడ ఆమె చేత తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమం తరువాత వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, అదనపు ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలను, డైరీ, క్యాలెండ్, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో బోర్డు సెల్ డిప్యూటీ ఈవో సుధారాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags :