Published : 28/02/2021 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పరిషత్‌ ఎన్నికల సామగ్రిని పరిశీలించిన సీఈవో


జడ్పీ కార్యాలయంలో అధికారులతో సమీక్షిస్తున్న ఇన్‌ఛార్జి సీఈవో ప్రభాకరరెడ్డి

 

చిత్తూరు జడ్పీ: పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని జడ్పీ ఇన్‌ఛార్జి సీఈవో ప్రభాకరరెడ్డి, అధికారులతో కలిసి తనిఖీ చేశారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో గతేడాది మార్చిలో నిర్వహించాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన సామగ్రిని శనివారం ఆయన పరిశీలించారు. బ్యాలెట్‌ పత్రాలు, పోలింగ్‌ మెటీరియల్‌ను పరిశీలించి ఏవోలకు సూచనలు ఇచ్చారు. అనంతరం సీఈవో తన ఛాంబర్‌లో ఎంపీడీవోలతో మాట్లాడారు. వచ్చే వారంలో హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఎంపీడీవోలు అందరూ సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. గుడిపాల, జీడీనెల్లూరు ఎంపీడీవోలు బాలగణేష్‌, శ్రీదేవి, విశ్రాంత ఎంపీడీవో మురళీ, ఏవోలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని