Published : 28/02/2021 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అధైర్యపడొద్ధు. అండగా ఉంటా


సమావేశం అనంతరం చంద్రబాబును సత్కరిస్తున్న కార్యకర్తలు

శాంతిపురం: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయామని తెదేపా శ్రేణులు అధైర్యపడాల్సిన అవసరం లేదని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శాంతిపురం, రామకుప్పం మండలాలల్లోని సర్పంచి స్థానాల్లో పోటీ చేసి గెలిచి, ఓడిన నాయకులు, కార్యకర్తల సమావేశాలను శుక్రవారం అర్ధరాత్రి శాంతిపురంలోని నందిగం కల్యాణ మండపంలో నిర్వహించారు. చంద్రబాబు ప్రసంగిస్తూ.. అధికార పార్టీ అక్రమాలు, అధికార దుర్వినియోగం, డబ్బు ప్రభావంతో గెలుపు సాధించిన విషయం అందరికీ తెలిసిందేని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమిపై నిరాశపడితే ముందుకు సాగలేమని స్పష్టం చేశారు. భవిష్యత్తు తెదేపాదే అని అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యకర్తలను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పంచాయతీల్లో ఓడిన, విజయం సాధించిన వారి అభిప్రాయాలను చంద్రబాబు తెలుసుకున్నారు. అధికార పార్టీ మద్దతుదారులు చాలా వరకు డబ్బు ప్రభావంతో గెలిచారని వివరించారు. పలుచోట్ల పోలింగ్‌ కేంద్రాల్లో కొందరు అధికారులు కూడా వారికి సహకరించారని అధినేత దృష్టికి తీసుకొచ్చారు. సర్పంచి స్థానాల్లో ఒడిన వారికి ఎంపీటీసీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని పలువురు కోరారు. ఇదే సందర్భంలో ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ముఖ్యనేతలుగా చెప్పుకొనే వారి వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని కొందరు ఆరోపించారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితి ఏర్పడిందని వాపోయారు. అన్నింటికీ త్వరలోనే పరిష్కారం చూపెడతానని.. పార్టీ శ్రేణులు కలసికట్టుగా సాగితే మంచి రోజులు వస్తాయని చంద్రబాబు హితోపదేశం చేశారు. నాయకులు, కార్యకర్తలు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నాయకులు జనార్దన్‌రెడ్డి, ఆంజినేయరెడ్డి, ఉదయ్‌కుమార్‌, విశ్వనాథనాయుడు, మణి, జీసీ గోవిందరాజులు, ఉయ్యాల జయరామిరెడ్డి, నాగరాజు, కేశవులు, చలపతి, మంజునాథ్‌, మునస్వామి, నందారెడ్డి, ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అధినేతకు ఘన వీడ్కోలు: చంద్రబాబు కుప్పం మూడు రోజుల పర్యటనను ముగించుకొని శనివారం ఉదయం 8.30 గంటలకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గం ద్వారా బయల్దేరారు. నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు ఆయనతో సెల్ఫీలు తీసుకొని, శాలువలు కప్పి అధినేతకు ఘనంగా వీడ్కోలు పలికారు.

● రాళ్లబూదుగురులో తెదేపా నేత కుమారుడు కిరణ్‌ ఆత్మహత్య చేసుకోవటంపై చంద్రబాబు దిగ్భా~రంతి వ్యక్తం చేశారు. యువకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని