
ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మొక్క నాటుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కరుణకుమార్
బంగారుపాళ్యం: తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా చదివించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణకుమార్ కోరారు. మండలంలోని రాగిమానుపెంట జడ్పీ హైస్కూల్లో శనివారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, రోప్స్, చిల్డ్రన్ బీలీవ్ సంస్ధ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రజలకు అవగా హన కల్పించాలన్నారు. సమస్యలను పరిశీలించి పరిష్కరించడానికే న్యాయవ్యవస్థ ఉందన్నారు.గురువుల అడుగుజాడల్లో నడిచి విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఉద్భోదించారు. ఆపై ర్యాగింగ్ నిషేధం, టోల్‌ఫ్రీ నంబర్ల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. రోప్స్ సంస్థ ఆధంర్యంలో బాల్యవివాహాల నిరోధానికి, పిల్లలను బడిలో చేర్చడానికి కృషిచేసిన వారికి లాప్‌టాప్‌లు, స్పీకర్లు, డేటా ఎంట్రీకార్డులను పంపిణీ చేశారు. పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాలలో విద్యార్థులకు మధ్నాహ్న భోజనాన్ని వడ్డించారు. ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసి రోగులను పరీక్షించారు. సీనియర్ న్యాయవాది భయ్యామేరీ, రోప్స్ సంస్ధ అధ్యక్షులు ధనశేఖర్, డైరెక్టర్ శ్రీలత, ఎంఈవో నాగేశ్వరరావు, సీడీపీవో వాణిశ్రీదేవి, ఎస్సై రామకృష్ణ, రాగిమానుపెంట సర్పంచి శ్రీహరి, ఉపాధ్యా యులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.