Published : 28/02/2021 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దోపిడీ ముఠా అరెస్టు

పూతలపట్టు: మండలంలోని పి.కొత్తకోట సమీపంలో ఈ నెల తొమ్మిదో తేదీన జాతీయ రహదారిపై రాత్రి ఒంటి గంట ప్రాంతంలో జరిగిన దోపిడీ కేసులో నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ సుధాకరరెడ్డి తెలిపారు. ఐదుగురు దుండగులు లారీ డ్రైవరు, క్లీనర్‌ను గాయపరిచి రూ.45వేలు దోపిడి చేశారన్నారు. దీనికి సంబంధించి శనివారం స్థానిక స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. డ్రైవరు సహకారంతోనే ఈ దోపిడీ జరిగిం దని, డ్రైవరు దేవేంద్ర లారీ బాడుగ సొమ్ముతో వెళ్తూ తనకు తెల్సిన శ్రీనివాసులు(27), వెంకటేష్‌(19), లోకేష్‌(26), మధు(25), అరసు(36)తో ముందుగా మాట్లాడాడు. తనవద్ద ఉన్న డబ్బును అనుమానం రాకుండా తనతో పాటు క్లీనరును గాయపరచి డబ్బు తీసుకెళ్లాలని చెప్పాడు. పథకం ప్రకారం జరిగిన దోపిడీ అనంతరం డ్రైవరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐదు బృందాలు పి.కొత్తకోట సమీప మద్యం దుకాణం వద్ద దుండగులను అరెస్టు చేశాం. వారినుంచి రూ.35వేలు నగదు, ఒక కత్తి, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నాం. కేసును ఛేదించిన సిబ్బందికి రివార్డు ఇచ్చామని డీఎస్పీ చెప్పారు.సీఐ ఆశీర్వాదం, ఎస్సై రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని