Published : 28/02/2021 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చంద్రబాబు పర్యటనతో ఒరిగిందేమీ లేదు


మాట్లాడుతున్న వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి భరత్‌

కుప్పం పట్టణం: కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు మూడు రోజుల పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని కుప్పం వైకాపా ఇన్‌ఛార్జి భరత్‌ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుప్పం నుంచి ఏడుసార్లు శాసన సభ్యుడిగా ఎన్నికైన చంద్రబాబు ఏడాది తరువాత కుప్పంలో పర్యటిస్తుంటే తమ సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు ఆశించారని, అయితే కేవలం పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చవిచూసి డీలాపడిన పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతోనే సరిపోయిందన్నారు. తెదేపాను గెలిపించుకోవాలని తప్పితే కుప్పం ప్రజల సమస్యలు పట్టలేదని.. కేవలం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వైకాపా నాయకులు డా.సుధీర్‌, విద్యాసాగర్‌, మురుగేష్‌, శరవణ ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని