close

శనివారం, జులై 11, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వివాహేతర సంబంధానికి అడ్డని భర్త హత్య

భార్య, ప్రియుడితో పాటు మరో ఇద్దరు అరెస్టు ●

కుమార్తె ఫిర్యాదుతో కేసును ఛేదించిన పోలీసులు


రాజోలులో వివరాలు వెల్లడిస్తున్న అమలాపురం డీఎస్పీ మాసూమ్‌ బాషా

రాజోలు, న్యూస్‌టుడే: సఖినేటిపల్లి మండలం వి.వి.మెరకలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలసి భార్యే హత్య చేయించినట్లు తేల్చారు. దీనిపై రాజోలు పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అమలాపురం డీఎస్పీ మాసూమ్‌బాషా వివరాలను వెల్లడించారు. వీవీమెరక ప్రగతినగర్‌కు చెందిన ఉప్పు ప్రసాద్‌(48) ఈ నెల 2న మృతి చెందాడు. కేసువదాసుపాలేనికి చెందిన రౌడీషీటర్‌ చొప్పల సుభాకర్‌ అలియాస్‌ శివ, తల్లి ఉప్పు ప్రశాంతి కలసి తన తండ్రిని హత్య చేసినట్లు మృతుని కుమార్తె ఈ నెల 24న సఖినేటిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఉప్పు ప్రసాద్‌ తన ఇంటివద్దనే సోడా కొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్య ప్రశాంతి, ప్రియుడు సుభాకర్‌ అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరికీ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న యడ్ల ప్రమీలారాణికి శివ మత్తు బిల్లలు తెచ్చి ఇచ్చేవాడు. వాటిని ప్రశాంతి తన భర్తకు ప్రతిరోజూ భోజనంలో కలిపి పెట్టేది. అలా అతడు అనారోగ్యానికి గురయ్యేలా చేశారు. ఈ నెల 2న రాత్రి తనకు అలసటగా ఉందని నిమ్మసోడా కావాలని భర్తను ప్రశాంతి అడిగింది. నిమ్మసోడా కోసం ఉప్పు ప్రసాద్‌ తన దుకాణంలోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ సిద్దంగా ఉన్న సుభాకర్‌ అతని అనుచరులు నల్లి వెంకటనరసింహారావు, జిల్లెళ్ల ప్రసాద్‌లు కలిసి ప్రసాద్‌ మెడకు తువాలు చుట్టి కిందపడేశారు. అక్కడే ఉన్న సుభాకర్‌ వచ్చి గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని కుర్చిలో కుర్చోపెట్టి వెళ్లిపోయారు. అనంతరం ఏమీ తెలియనట్లు భార్య ఉప్పు ప్రశాంతి వచ్చి హడావుడి చేయడంతో కుమార్తె స్థానికుల సహాయంతో రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు సహజ మరణంగా భావించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. రెండు వారాల తరువాత మృతుడి భార్య తన ప్రియుడితో ఫోన్‌లో సంభాషిస్తుండగా కుమార్తె విని కుటుంబ సభ్యుల సహాయంతో స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో నిందితులు నేరం ఒప్పుకోవడంతో నలుగురినీ అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించామని డీఎస్పీ తెలిపారు. మరో నిందితురాలు ప్రమీలారాణి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన శిక్షణ డీఎస్పీ బాలచంద్రారెడ్డి, అమలాపురం డీఎస్పీ మసూల్‌ బాషా, రాజోలు సీఐ దుర్గాశేఖర్‌ రెడ్డి, ఎస్సై సురేష్‌లను జిల్లా ఎస్పీ నయీం అస్మి అభినందనలు తెలియజేసినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.