Updated : 13/04/2021 06:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విద్యుదాఘాతంతో యువకుడి మృతి 


వార సాయినాథ్‌ (పాత చిత్రం)

 

పి.గన్నవరం, అంబాజీపేట: అంబాజీపేట మండలం చిరుతపూడిలోని ఎస్‌.ఎస్‌.నగర్‌కు చెందిన వార సాయినాథ్‌(19) పి.గన్నవరం మండలం కారుపల్లిలో ఒక ఇంటికి పెయింటింగ్‌ పని చేస్తుండగా అతనికి ప్రమాదవశాత్తూ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు ఏఎస్సై టి.శ్రీనివాస్‌ తెలిపారు. కౌలు రైతు వార శ్రీనివాస్‌(పండు), శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. కష్టపడి పనులు చేసుకుంటూ వారు తమ కుమారుల్ని చూసుకున్నారు. పెద్ద కుమారుడు సాయినాథ్‌ డిగ్రీ చదువుకున్న తరువాత ఖాళీగా ఉండకుండా ఇటీవలే పెయింటింగ్‌ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. చేతికి అందొచ్చిన కొడుకు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని