Hyderabad Rains: వరదలపై.. కంట్రోల్‌ లేదు!
eenadu telugu news
Updated : 24/07/2021 10:54 IST

Hyderabad Rains: వరదలపై.. కంట్రోల్‌ లేదు!

● వర్షాకాల సన్నద్ధతపై జీహెచ్‌ఎంసీ అలసత్వం

● ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు శూన్యం

మూసారాంబాగ్‌ వద్ద ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్న స్థానికుడు

ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: గతంలో నగరానికి వరదలు వచ్చిన ప్రతిసారీ బల్దియా కంట్రోల్‌ రూము విశేషంగా సేవలందించింది. కొవిడ్‌ సమయంలోనూ బాధితులకు అండగా నిలిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నా..పలువురు అధికారులు నిద్రమత్తు వీడటం లేదు. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్వహిస్తోన్న కంట్రోల్‌ రూము సేవలను పూర్తిగా నీరుగార్చారు. వరదసాయం కోసం పౌరుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించే పరిస్థితి లేదు. అసలు ఫోను మాట్లాడి అవతలి వారి బాధను ఆలకించేవారే లేరంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్ఛు

అధికారుల్లేకుండానే..

కంట్రోల్‌ రూము నిర్వహణకు బల్దియా ఏటా రూ.4కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రతి ఫిర్యాదును ఫోన్‌ నెంబరుతోపాటు రికార్డు చేసి.. పరిష్కరించాక ఫిర్యాదుదారుకు ఎస్సెమ్మెస్‌ పంపే వ్యవస్థ ఉండేది. ఇప్పుడా విధానం అమలు కావడం లేదు. అధికారులూ పట్టించుకోవడం లేదు. అత్యవసర బృందాలు ఎల్లవేళలా అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం అలాంటి చర్యలు మచ్చుకు కూడా కనిపించడం లేదు.

తెరిపినిచ్చిన వాన.. : వరుస వర్షాలకు అతలాకుతలమైన నగర కాలనీలు కుదుటపడ్డాయి. శుక్రవారం మధ్యాహ్నం దాకా పలు ప్రాంతాల్లో 1సెం.మీ. వాన పడింది. మిగతా రోజంతా కొన్ని చోట్ల చిరుజల్లులు కురియగా.. చాలాచోట్ల తెరిపినిచ్చింది. నాలాల ప్రవాహ వేగం తగ్గడంతో పరిసర కాలనీలు ఉపశమనం పొందాయి.

జీహెచ్‌ఎంసీ కంట్రోలు రూమ్‌ నంబర్లు.. 040-21111111, 040- 29555500, 9000223667


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని