గుడ్లు తీసుకోండి.. టీకా వేసుకోండి
eenadu telugu news
Published : 20/09/2021 01:00 IST

గుడ్లు తీసుకోండి.. టీకా వేసుకోండి

గుడ్లు పంపిణీ చేస్తున్న కౌన్సిలరు నీరజ, నాయకులు

తాండూరు టౌన్‌ (న్యూస్‌టుడే): తాండూరు పురపాలక సంఘం 11వ వార్డు కౌన్సిలరు నీరజ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీరనాగమ్మ దేవాలయం వద్ద వాక్సినేషన్‌ కేంద్రంలో స్థానికులకు టీకాలు వేయించారు. టీకాలు వేయించుకోవడానికి వచ్చిన వారికి ఆమె కోడి గుడ్లు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి నాలుగు చొప్పున గుడ్లను అందజేశారు. మొదటి రోజు మొత్తం 90 మందికి గుడ్లు పంపిణీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని