గోవుల సంరక్షణ సామాజిక బాధ్యత
eenadu telugu news
Published : 20/09/2021 01:00 IST

గోవుల సంరక్షణ సామాజిక బాధ్యత

గోశాల నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తున్న అహోబిల జీయర్‌ స్వామి

శంషాబాద్‌, న్యూస్‌టుడే: అంతరించిపోతున్న గోవులను సంరక్షించడాన్ని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించాలని అహోబిల జీయర్‌ స్వామి పేర్కొన్నారు. శంషాబాద్‌ పరిధి పెద్దషాపూర్‌ తాండా సమీపంలో జీయర్‌ స్వామి ధ్యాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న గోశాల నిర్మాణ పనులకు అహోబిల జీయర్‌ స్వామి భూమి పూజ చేశారు. ధ్యాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 48 గోశాలలో 70 వేలకు పైగా గోవులను సంరక్షించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేలకు పైగా గోవులను సంరక్షిస్తున్నారన్నారు. గోవులను కాపాడి ఆరాధించే వారికి దైవానుగ్రహం ఉంటుందన్నారు. ధ్యాన్‌ ఫౌండేషన్‌ నిర్వహకులు దీపక్‌, మీనాక్షి, కమలేశ్‌స్వామి, మోహన్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని