రూ.50 లక్షలతో నాగసమందర్‌ వంతెన నిర్మాణం
eenadu telugu news
Published : 20/09/2021 01:28 IST

రూ.50 లక్షలతో నాగసమందర్‌ వంతెన నిర్మాణం

తాండూరు, న్యూస్‌టుడే: ధారూర్‌-నాగసమందర్‌ రహదారి మార్గంలో వంతెన పనులకు ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేయడంతో పనులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కోట్‌పల్లి జలాశయంలోకి వచ్చిన వరద ఎక్కువై అలుగు ద్వారా దిగువకు ఉద్ధృతంగా ప్రవహించడంతో వంతెన తెగిపోయి రాకపోకలు స్తంభించిన విషయం విధితమే. ఈనేపథ్యంలో ప్రభుత్వం రహదారిపై నుంచి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు తెగిపోయిన వంతెనను ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పనులను త్వరలోనే పూర్తి చేసి వాహనాల రాకపోకలకు వంతెనను అందుబాటులోకి తెస్తామని తాండూరు రహదారులు, భవనాల శాఖ ఉపకార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాస్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని