ప్రమాదవశాత్తు చెరువులో మునిగి విద్యార్థి మృతి
eenadu telugu news
Published : 20/09/2021 01:28 IST

ప్రమాదవశాత్తు చెరువులో మునిగి విద్యార్థి మృతి

అల్లాదుర్గం, న్యూస్‌టుడే: చెరువులోకి వెళ్లిన జీవాలను ఒడ్డుకు చేర్చేందుకు వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లా అల్లాదుర్గం గ్రామ శివారులోని పటేల్‌ చెరువులో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపిన వివరాలు.. మండలంలోని గొల్లకుంట తండాకు చెందిన సర్దార్‌, బుజ్జిబాయి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ప్రవీణ్‌ (16) ఉన్నారు. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పోతులబొగుడ ఆదర్శ జూనియర్‌ కళాశాలలో ప్రవీణ్‌ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం పశువులను అల్లాదుర్గం శివారులోని పటేల్‌ చెరువు సమీపంలోకి మేపడానికి తీసుకెళ్లాడు. అదే రోజు సాయంత్రం చెరువులోకి దిగడంతో వాటిని ఒడ్డుకు చేర్చే క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగాడు. సమీపంలో ఉన్న లక్ష్మి గమనించి కుటుంబీకులకు, తండావాసులకు సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా అప్పటికే చీకటి పడటంతో గాలించలేకపోయారు. ఆదివారం ఉదయం గాలించగా మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి సర్దార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని