పాము కాటుతో యువ రైతు..
eenadu telugu news
Published : 20/09/2021 01:28 IST

పాము కాటుతో యువ రైతు..

మెదక్‌ టౌన్‌ (పాపన్నపేట) న్యూస్‌టుడే: పాము కాటుతో యువరైతు మృతిచెందిన ఘటన పాపన్నపేట మండలం కుర్తివాడలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కొత్తూరి దుర్గాప్రసాద్‌ (33) ఆదివారం వరి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లగా అక్కడ పాము కాటువేసింది. వెంటనే అతను కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిగా ఘటనా స్థలానికి చేరుకొని అతన్ని మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. ఆయనకు భార్య లక్ష్మీ, కుమారుడు ఉన్నారు. పాపన్నపేట ఎస్‌ఐ సురేష్‌ను వివరణ కోరగా.. ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని