మారణాయుధాలతో పట్టుబడిన ముఠా!
eenadu telugu news
Updated : 20/09/2021 06:05 IST

మారణాయుధాలతో పట్టుబడిన ముఠా!

తుపాకీ సహా కత్తులు, ఇనుప రాడ్లు స్వాధీనం

నిందితులను చూపుతున్న ఎస్‌ఐ కాశీనాథ్‌

జహీరాబాద్‌ అర్బన్‌: మారణాయుధాలతో కారులో సంచరిస్తున్న ఐదుగురు నిందితుల ముఠాను వెంటాడి పట్టుకున్నట్లు చిరాగ్‌పల్లి ఎస్‌ఐ కాశీనాథ్‌ పేర్కొన్నారు. మొగుడంపల్లి మండలం విఠునాయక్‌తండా రోడ్డు ఆదివారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న కారు, ద్విచక్ర వాహనం నిలిపి పోలీసులు దగ్గర వెళ్లగానే పారిపోతుండగా వారిని వెంబడించినట్లు తెలిపారు. విఠునాయక్‌తండా సమీపంలో కర్ణాటకలోని సంగాపూర్‌తండా రోడ్డులో నిందితులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేయగా తుపాకీ సహా కత్తులు, ఇనుప రాడ్లు, బేస్‌బాల్‌ బ్యాట్‌ లభ్యమైనట్లు చెప్పారు. నిందితులు కర్ణాటకలోని బీదర్‌కు చెందిన అభిలాష్‌(28), బబ్లూ(28), బసవసాగర్‌(25), సచిన్‌కుమార్‌(24), మెరిల్‌(22)గా గుర్తించామని అన్నారు. జాడీమల్కాపూర్‌ జలపాతాల వద్ద జంటలు, ధర్మసాగర్‌- జహీరాబాద్‌ రోడ్డులో ద్విచక్ర వాహనాల్లో రాకపోకలు సాగించే దంపతులను బెదిరించి దోచుకోవడానికి వచ్చినట్లు అనుమానిస్తున్నట్లు, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్సై పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని