సౌదీలో దాచారం వాసి..
eenadu telugu news
Published : 20/09/2021 01:28 IST

సౌదీలో దాచారం వాసి..

బెజ్జంకి, న్యూస్‌టుడే: ఉపాధి కోసం పరాయి దేశానికి వలస వెళ్లిన కార్మికుడు అక్కడే అనారోగ్యంతో మృతి చెందడం బాధిత కుటుంబంలో విషాదాన్ని నింపింది. గ్రామస్థులు, బాధితుల సమాచారం ప్రకారం.. బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన దొగ్గలి రవీందర్‌(46) ఊళ్లో ఉపాధి లేక పొట్ట చేతబట్టుకొని 16 సంవత్సరాల క్రితమే గల్ఫ్‌ బాట పట్టాడు. సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో ప్లంబర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సుమారు రెండు సంవత్సరాల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్లిన రవీందర్‌ కొద్ది నెలల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో మెరుగైన చికిత్స అందక ఆరోగ్యం మరింత క్షీణించింది. కొద్ది రోజుల క్రితమే ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కొందరు మిత్రులు శనివారం రాత్రి స్వగ్రామంలోని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అతడికి భార్య, కూతురు, కుమారుడు ఉండగా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం శోకసముద్రంలో మునిగింది. గల్ఫ్‌ కార్మికుల అవగాహన వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి గాజుల సంపత్‌, జిల్లా అధ్యక్షుడు తిరుపతి తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం స్పందించి మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని