బాలిక అపహరణ కేసు.. ఇద్దరి రిమాండ్‌
eenadu telugu news
Published : 20/09/2021 01:28 IST

బాలిక అపహరణ కేసు.. ఇద్దరి రిమాండ్‌

సంగారెడ్డి అర్బన్‌: సంగారెడ్డి పట్టణానికి చెందిన పదేళ్ల బాలికను శనివారం అపహరించిన కేసులో ఆదివారం ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు గ్రామీణ ఎస్‌ఐ కె.సుభాష్‌ తెలిపారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా బాలికను తీసుకెళ్లినందుకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. బాలికల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని