వర్షంలోనే నిమజ్జనం
eenadu telugu news
Published : 20/09/2021 02:15 IST

వర్షంలోనే నిమజ్జనం

వానలో తడుస్తూనే ముందుకు సాగుతున్న ఊరేగింపు

ఈనాడు, హైదరాబాద్‌: వినాయక నిమజ్జనానికి వరుణుడు పలుమార్లు విఘ్నాలు కలిగించినా.. సజావుగా సాగింది. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం అరగంట సేపు, తిరిగి సాయంత్రం మరోసారి తేలికపాటి వర్షం కురిసింది. జనం తడిసి ముద్దయ్యారు. బస్‌స్టాపులు, చెట్ల కింద, పైవంతెనల కిందకు పరుగెత్తారు. వాన తగ్గగానే మళ్లీ హుస్సేన్‌సాగర్‌ పరిసరాలకు తరలిరావడంతో సందడి కన్పించింది. శివారులో భారీ వర్షంతో నిమజ్జనాలు మందకొడిగా సాగాయి. కూకట్‌పల్లిలో అత్యధికంగా 3.95 సెం.మీ. వర్షపాతం నమోదుకాగా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 సెం.మీ. పైన వాన పడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని