Crime News: దగ్ధమైన కారులో వైద్యుడు.. ప్రమాదమేనా?.. కుట్రా? 
eenadu telugu news
Updated : 20/09/2021 07:12 IST

Crime News: దగ్ధమైన కారులో వైద్యుడు.. ప్రమాదమేనా?.. కుట్రా? 

నేలపాటి సుధీర్‌

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ఔటర్‌ రింగు రోడ్డుపై శనివారం రాత్రి కారు దగ్ధమైన ఘటనలో మృతి చెందిన వ్యక్తిని డా.నేలపాటి సుధీర్‌(39)గా గుర్తించారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పొన్నలూరు మండల కేంద్రంలోని శివాజీనగర్‌. కొన్నేళ్లుగా కేపీహెచ్‌బీ పరిధిలోని సర్దార్‌ పటేల్‌ నగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య సుప్రజ, తొమ్మిది సంవత్సరాల కుమారుడు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆయన నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌ వైద్యుడిగా సేవలందించేవారు. కొంత కాలం నుంచి ఆయన వైద్య వృత్తిని వదిలి మైనింగ్‌ వ్యాపారం చేస్తున్నారు. శనివారం ఆయన బయటకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి కారులో ఒంటరిగా బయలుదేరారు. నానక్‌రామ్‌గూడ కూడలి వద్ద బాహ్యవలయ రహదారిపైకి ఎక్కారు. శంషాబాద్‌, హమీదుల్లానగర్‌ 135 కి.మీ వద్దకు రాగానే కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆ వైద్యుడు సజీవ దహనమయ్యారు. షార్ట్‌సర్యూట్‌ కారణంగానే కారులో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.

20 కి.మీ దూరం..గంట ప్రయాణం

బాహ్యవలయ రహదారిపై గంటకు వంద కి.మీ వేగంతో ప్రయాణించడానికి అనుమతి ఉంది. సుధీర్‌ నానక్‌రామ్‌గూడ కూడలి వద్ద సాయంత్రం 7.09 గంటలకు ఔటర్‌పైకి ప్రవేశించినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. నానక్‌రామ్‌గూడ నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న హమీదుల్లానగర్‌కు 20 నిమిషాల లోపే చేరుకోవచ్ఛు కానీ సుధీర్‌ గంట ప్రయాణం చేసిన తర్వాత రాత్రి 8.10 గంటలకు హమీదుల్లానగర్‌ వద్ద కారు మంటల్లో చిక్కుకుంది. ఔటర్‌పై ఎక్కడైనా ఆగాడా..లేక కారు ఇంజిన్‌ మొరాయించిందా.. ఏదైనా కుట్ర, ఆత్మహత్య కోణం ఉందా అన్ని విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్యుడు ప్రమాదంలో మృతిచెందడంతో పొన్నలూరు మండల కేంద్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని