సానుకూల దృక్పథం అంతరాన్ని తగ్గిస్తుంది
eenadu telugu news
Published : 20/09/2021 02:15 IST

సానుకూల దృక్పథం అంతరాన్ని తగ్గిస్తుంది

కవితా సంకలనాన్ని ఆవిష్కరిస్తున్న సోమేష్‌ కుమార్‌, చిత్రంలో ఆదిత్యనాథ్‌దాస్‌ సతీమణి
పద్మజాదాస్‌, ఎన్‌.గోపి, రామ్‌ ప్రసాద్‌

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: సానుకూల దృక్పథం మనుషుల మధ్య అంతరాన్ని తగ్గిస్తుందని, ఏ పనైనా మనసు పెట్టి చేస్తే ఎప్పటికీ నిలిచిపోతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ రచించిన ‘డాన్సింగ్‌ విత్‌ డ్రీమ్స్‌’ కవితా సంకలనాన్ని బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌డెక్కన్‌లో ఆదివారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చక్కని భాషతో ఊహాత్మక దృశ్యాలను, మానవీయతను కవితల ద్వారా కళ్ల ముందు నిలిపారని ప్రశంసించారు. గౌరవ అతిథిగా హాజరైన తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య ఎన్‌.గోపి మాట్లాడుతూ మంచి భావ వ్యక్తీకరణతో ఆదిత్యనాథ్‌ మానవీయ కవిత్వం రచించారని పేర్కొన్నారు. ఆదిత్యనాథ్‌ దాస్‌ మాట్లాడుతూ.. కళాశాల రోజుల నుంచి కవితలు రాయడం ప్రారంభించానన్నారు. సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి కె.సచ్చిదానందన్‌, లలిత కళా అకాడమీ మాజీ ఛైర్మన్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అశోక్‌ వాజ్‌పేయి వీడియో సందేశం ద్వారా ఆదిత్యనాథ్‌ దాస్‌ను అభినందించారు. ఐఏఎస్‌ అధికారి నవీన్‌ మిత్తల్‌, పుస్తక ప్రచురణకర్త రామ్‌ప్రసాద్‌, పలువురు విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని