డప్పుల దరువులు.. తీన్మార్‌ నృత్యాలు
eenadu telugu news
Published : 20/09/2021 02:15 IST

డప్పుల దరువులు.. తీన్మార్‌ నృత్యాలు

ఈనాడు, హైదరాబాద్‌ : బూరలతో శబ్దాలు చేస్తూ సాగర తీరాన్ని మార్మోగించారు... తిన్మార్‌ దరువులకు అనుగుణంగా నృత్యాలతో అదరగొట్టారు.. ఏక రూప దుస్తులతో నిమజ్జనానికి సరికొత్త రంగులద్దారు.. గణేశ్‌ నిమజ్జనంలో ఎక్కడ చూసినా యువత సందడే. వర్షపు జల్లులోనూ యువతీయువకుల కోలాహలం మధ్య గణనాథుల నిమజ్జనం సాగింది. జై బోలో గణేష్‌ మహారాజ్‌కి జై.. గణపతి బప్పా మోరియా..అంటూ నినాదాలతో యువతరం భక్తిపారవశ్యంలో మునిగితేలింది.

జల్లులో తడుస్తూనే.. చవితి పండగ వచ్చిందంటే మండపాల ఏర్పాటు మొదలు.. నవరాత్రుల పూజలు.. నిమజ్జనం వరకు కుర్రకారే ఎక్కువగా ముందుండి నడిపిస్తుంటారు. సహజంగానే శోభయాత్రలోనూ వారి హడావుడే అధికంగా కన్పించింది. మండప నిర్వాహకుల్లోని యువతరమంతా ఏకరూప దుస్తులు ధరించి డప్పుల దరువులకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ మైమరిచిపోయారు. నిర్వాహకులే కాదు శోభాయాత్ర తిలకించేందుకు వచ్చిన వారిలోనూ అధికంగా యువతనే కన్పించింది. కొవిడ్‌ భయాలున్నా.. మాస్క్‌లు ధరించి ఏడాదికోసారి వచ్చే సందడిని కనులారా వీక్షించేందుకు హుస్సేన్‌సాగర్‌ తీరానికి ఉదయం నుంచే చేరుకున్నారు. సాయంత్రానికి రద్దీ బాగా పెరిగింది. అంతా ఒకచోట చేరి బూరలు శబ్దాలతో ట్యాంక్‌బండ్‌ మార్మోగింది. ఒక పక్క వర్షంలో తడుస్తూనే హుషారుగా గణనాథులను సాగరంలో నిమజ్జనం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని