మొక్కలు నాటిన ఆమిర్‌ఖాన్‌, నాగచైతన్య
eenadu telugu news
Published : 20/09/2021 02:15 IST

మొక్కలు నాటిన ఆమిర్‌ఖాన్‌, నాగచైతన్య

స్వీయ చిత్రం దిగుతున్న ఆమిర్‌ఖాన్‌, నాగచైతన్య, సంతోష్‌కుమార్‌

బేగంపేట, న్యూస్‌టుడే: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ఖాన్‌, టాలీవుడ్‌ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య బేగంపేట విమానాశ్రయం ఆవరణలో ఆదివారం మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ పిలుపు మేరకు ఆయతో కలిసి ఆమిర్‌ఖాన్‌, నాగచైతన్యలు మొక్కలు నాటారు. ఆమిర్‌ఖాన్‌ మాట్లాడుతూ.. తన జీవితంలో ఎన్నో ఛాలెంజ్‌లు చూశానని, మొక్కలు నాటే వినూత్న ఛాలెంజ్‌ను తనకు ఎంపీ సంతోష్‌కుమార్‌ పరిచయం చేశారని అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు కిషోర్‌గౌడ్‌, రామ్మోహన్‌రావు, రాఘవ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని