నేడూ.. కొనసాగింపు!
eenadu telugu news
Published : 20/09/2021 02:15 IST

నేడూ.. కొనసాగింపు!

ఈనాడు, హైదరాబాద్‌: మహా నిమజ్జనం సోమవారం కూడా కొనసాగే అవకాశాలున్నాయి 24 గంటలలోపు నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయాలని పోలీస్‌ యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ వర్షం కురవడంతో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంది. దీంతో ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, పీపుల్స్‌ ప్లాజా వద్ద గణేష్‌ విగ్రహాలతో కూడిన వాహనాలు భారీగా నిలిచాయి. సరూర్‌నగర్‌, సఫిల్‌గూడ, కూకట్‌పల్లి ఐడీఎల్‌ చెరువు సహా మరికొన్ని చెరువుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. మరోవైపు పాతబస్తీ, పశ్చిమమండలం పరిధుల్లో రాత్రి 9గంటలకు భక్తులు విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు బయలుదేరారు. ఇక కొత్వాల్‌ అంజనీకుమార్‌ ట్యాంక్‌బండ్‌పైనే అర్ధరాత్రి దాటేంత వరకూ ఉన్నారు. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ మన్సురాబాద్‌, నాగోల్‌, తుర్కయాంజాల్‌, సరూర్‌నగర్‌లో పర్యటించారు. నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షించి సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర కూకట్‌పల్లి, సనత్‌నగర్‌, రాజేంద్రనగర్‌లో పర్యటించారు. తాజా పరిస్థితుల దృష్ట్యా ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌, సికింద్రాబాద్‌, సరూర్‌నగర్‌, ఇతర నిమజ్జన ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం వరకూ ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగే అవకాశాలున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని