HYD: అమ్మ చేసిన అంగడి బొమ్మ!
eenadu telugu news
Updated : 20/09/2021 12:35 IST

HYD: అమ్మ చేసిన అంగడి బొమ్మ!

2019లో: ట్యాంక్‌బండ్‌పై పసికందుతో తల్లి

చేతికి గాయం మరకలు.. నీరసించిన స్థితిలో పడిపోయి ఉన్న తల్లి.. పక్కనే బిక్కచూపులు చూస్తూ ఓ చిన్నారి. ఈ చిత్రం చూసిన ఎవరి గుండె అయినా చెమర్చక మానదు. ఇది ఆ ఇద్దరి విధిరాత కాదు. మత్తు మహమ్మారి రాసిన ఓ ‘వీధి’రాత. తన అలవాట్లు తీర్చుకునేందుకు ఈ చిన్నారిని అంగడి బొమ్మను చేసిందా అమ్మ! రెండేళ్లుగా ఆ చిన్నారిని ఇలాగే వాడుకుంటోందా తల్లి. ఏటా ట్యాంక్‌బండ్‌పై గణేశ్‌ నిమజ్జనాల సమయంలో ఇలాగే దర్శనమిస్తోంది. 2019 సెప్టెంబరు 12న నిమజ్జనాల వేళ ఆమెపై పలు ఫిర్యాదులొస్తే అదుపులోని తీసుకొని సంరక్షణ కేంద్రానికి తరలించారు. రెండేళ్ల తర్వాత ఆదివారం మళ్లీ దర్శనమిచ్చింది. ఆమె చేతిపై ఉన్న మరకలు పెయింటింగ్‌.

2021లో: అదే ప్రాంతంలో మళ్లీ ఆ మహిళే..

- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని