వంతెనల పనులను వేగవంతం చేయండి
eenadu telugu news
Published : 28/09/2021 02:08 IST

వంతెనల పనులను వేగవంతం చేయండి

శాసనసభలో జిల్లా వాణి..

వికారాబాద్‌టౌన్‌,న్యూస్‌టుడే: వికారాబాద్‌ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న వంతెన పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే ఆనంద్‌ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయమై ఆయన ప్రస్తావించారు. ధారూర్‌ మండలం దోర్నాల్‌, వికారాబాద్‌ మండలం పులుసుమామిడి, సిద్దులూరు వద్ద నిర్మిస్తున్న వంతెన పూర్తికాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. నాగసముందర్‌ వద్ద కొత్తగా వంతెన ఏర్పాటు చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రికి విన్నవించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని