యథావిధి.. ముసిరింది చీకటి!
eenadu telugu news
Published : 28/09/2021 03:39 IST

యథావిధి.. ముసిరింది చీకటి!

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: విరామం లేకుండా పడిన వర్షానికి సోమవారం ఉదయం నుంచి నగరంలో చాలా చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాటేదాన్‌ పరిధిలో ఓ సబ్‌స్టేషన్‌ వరదల్లో మునిగిపోవడంతో కాలనీల్లో సరఫరా ఆగింది. వినియోగం ఎక్కువుండటంతో కాటేదాన్‌ పారిశ్రామికవాడలో పరిశ్రమలకు మాత్రం సరఫరా నిలిపివేసింది.

* వర్షాలతో విద్యుత్తు సరఫరా తీరుపై టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముప్పు తగ్గే వరకు నిరంతర పర్యవేక్షణ కోసం స్కాడా కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, ముగ్గురు చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు సిబ్బందితో సమన్వయం చేస్తారని తెలిపారు. 73820 72104, 73820 72106 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని