తండ్రిని పొట్టన పెట్టుకున్న ‘కోపం’
eenadu telugu news
Published : 28/09/2021 03:39 IST

తండ్రిని పొట్టన పెట్టుకున్న ‘కోపం’

కొట్టి ఆసుపత్రికి తరలింపు.. మృతి

కార్వాన్‌, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి, కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో తండ్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. టప్పాచబుత్ర ఇన్‌స్పెక్టర్‌ జి.సంతోష్‌కుమార్‌, స్థానికుల కథనం ప్రకారం.. టప్పాచబుత్ర తాలీం ఆమ్లాపూర్‌లో అలీ హుస్సేన్‌ఖాన్‌(67) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇతని పెద్ద కొడుకు అంజద్‌అలీఖాన్‌(35)తో ఇటీవల మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం తండ్రి, కొడుకుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన అంజద్‌అలీఖాన్‌ తండ్రి తల, కాళ్లపై గుర్తు తెలియని ఆయుధంతో బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన తండ్రిని కుటుంబ సభ్యుల సహకారంతో నిందితుడే ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ అలీ హుస్సేన్‌ఖాన్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌కుమార్‌ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని