Crime News: పెరుగు కోసమెళ్లి.. మృత్యుఒడికి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌!
eenadu telugu news
Updated : 28/09/2021 09:33 IST

Crime News: పెరుగు కోసమెళ్లి.. మృత్యుఒడికి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌!

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రజనీకాంత్‌ గల్లంతు విషాదాంతం

42 గంటల గాలింపు తర్వాత మృతదేహం లభ్యం

ఈనాడు-హైదరాబాద్‌, నార్సింగి న్యూస్‌టుడే

రజినీకాంత్‌ గోపిశెట్టి

ణికొండ గోల్డెన్‌టెంపుల్‌ వద్ద నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో పడి గల్లంతైన ఐటీ ఉద్యోగి గోపిశెట్టి రజనీకాంత్‌(42) మృతదేహం నెక్నాంపూర్‌ చెరువులో గుర్తించారు. భార్య స్వప్న ప్రైవేటు ఉద్యోగి. ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు, స్థానికుల వివరాలిలా ఉన్నాయి. రాంనగర్‌కు చెందిన రజనీకాంత్‌, స్వప్న దంపతులు ఆరేళ్ల క్రితం మణికొండ పరిధి సెక్రటేరియేట్‌ కాలనీలోని బాబానివాస్‌ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాటు కొనుగోలు చేసి అక్కడే ఉంటున్నారు. షాద్‌నగర్‌ వద్ద సాఫ్ట్‌వేర్‌ సంస్థలో రజనీకాంత్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో బయటకు వెళ్లిన రజనీకాంత్‌ కొద్ది సమయానికే ఇల్లు చేరారు. 9 గంటల సమయంలో మరోసారి పెరుగు కోసం బయటకు వచ్చారు. పెరుగు ప్యాకెట్‌ తీసుకుని ఇల్లు చేరేందుకు బయల్దేరారు. రాత్రి 9.14 గంటల సమయంలో గోల్డెన్‌టెంపుల్‌ ఎదురుగా ఉన్న డ్రైనేజీ మీద ఉన్న మార్గం మీదుగా వెళ్తూ మురుగుకాల్వలో పడిపోయారు. అప్పటికే అక్కడ భారీగా వరదచేరటంతో కాల్వలో కొట్టుకుపోయారు. సమీపంలోని చారి అనే వ్యక్తి వరదను చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాద ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో నాలాలు కలిసే నెక్నాంపూర్‌ చెరువులో ఆదివారం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. మూడోరోజు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నెక్నెంపూర్‌ చెరువులో గుర్రపుడెక్క తొలగిస్తుండగా రజనీకాంత్‌ మృతదేహం బయటపడింది.

నీలిరంగు చొక్కా ఆధారం

డ్రైనేజి మ్యాన్‌హోల్‌లో గల్లంతైన వ్యక్తి ధరించిన దుస్తుల ఆధారంగా రజినీకాంత్‌గా అనుమానించారు. వీడియోలో అతని ముఖం స్పష్టంగా కనిపించక పోవడంతో అతనే అని నిర్ధారించేందుకు నిరాకరించారు. సోమవారం మధ్యాహ్నం మృతదేహం గుర్తించిన అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. 42 గంటల పాటు నీటిలోనే ఉండటంతో ముఖం గుర్తుపట్టలేనంతగా మారింది. నీలి రంగు చొక్కా ఆధారంగా రజనీకాంత్‌ అని నిర్ధారించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని