దిశ కమిటీ విచారణకు హాజరైన పోలీసు అధికారులు
eenadu telugu news
Published : 28/09/2021 04:03 IST

దిశ కమిటీ విచారణకు హాజరైన పోలీసు అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై విచారణ జరుపుతున్న సిర్పుర్కర్‌ కమిటీ ఎదుట సోమవారం పలువురు పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ ఉదంతంపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాని(సిట్‌)కి నేతృత్వం వహిస్తున్న మహేష్‌ భగవత్‌, బృంద సభ్యురాలు, ప్రస్తుత వనపర్తి ఎస్పీ అపూర్వరావులతో పాటు శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి హాజరయ్యారు. కమిటీ ముగ్గుర్నీ వేర్వేరుగా విచారించింది. దర్యాప్తు సందర్భంగా కాల్పుల్లో పాల్గొన్న వారిని సిట్‌ విచారించిన విధానం, సేకరించిన ఆధారాలపై మహేష్‌ భగవత్‌, అపూర్వారావులను కమిటీ పలు ప్రశ్నలు అడిగింది. ఎన్‌కౌంటర్‌ అనంతరం ప్రకాశ్‌రెడ్డి నిర్వహించిన విలేకరుల సమావేశానికి సంబంధించిన వీడియోలను ఇవ్వాలని కమిటీ కోరడంతో వాటిని అందజేశారు. అనంతరం జాతీయ మానవహక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ)కు సంబంధించిన ముగ్గురు సభ్యులు కూడా కమిటీ ఎదుట హాజరయ్యారు. ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై ఏ అధికారంతో విచారణ జరిపారని సిర్పుర్కర్‌ కమిటీ ప్రశ్నించడంతో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు విచారణ చేపట్టే అధికారం చట్టపరంగా తమకు ఉందని హెచ్‌ఆర్సీ సభ్యులు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని