చాక్లెట్ల మాటున బంగారం తరలింపు
eenadu telugu news
Published : 28/09/2021 04:03 IST

చాక్లెట్ల మాటున బంగారం తరలింపు

 

శంషాబాద్‌, న్యూస్‌టుడే: సౌదీ నుంచి ఓ ప్రయాణికుడు చాక్లెట్ల మాటున తీసుకొస్తున్న అక్రమ బంగారాన్ని సోమవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి.. సౌదీ అరేబియాలోని రియాద్‌ నుంచి వస్తూ 763 గ్రాముల బంగారాన్ని చాక్లెట్ల డబ్బాల్లో రహస్యంగా తీసుకువచ్చాడు. ప్రయాణికుడి ప్రవర్తనపై అనుమానం వచ్చి పరిశీలించి రూ.34.24 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని