వాగులు.. నదులు.. పరవళ్లు..
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

వాగులు.. నదులు.. పరవళ్లు..

బషీరాబాద్‌, న్యూస్‌టుడే: బషీరాబాద్‌ మండలం నవాంద్గీ, ఇందర్‌చేడ్‌, మర్పల్లి, నీళ్లపల్లి, గంగ్వార్‌, జీవన్గీ గ్రామాల్లో పత్తి, కంది పంటలు నీట మునిగాయి. జీవన్గీ మహాదేవ లింగేశ్వరాలయం, నవాంద్గీ సంగమేశ్వరాలయం వద్ద కాగ్నా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
దోమ: దోమ మండల పరిధి పరిగి-మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారి గొడుగోనిపల్లి, గడిసింగాపూర్‌-కొత్లాబాద్‌ ప్రధాన రహదారి బ్రాహ్మణపల్లి వద్ద వాగులు పొంగుతున్నాయి. తహసీల్దార్‌ వాహేదకాతూం,  ఎస్‌ఐ రమేష్‌లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు.  

కుల్కచర్ల: కుల్కచర్ల, కొత్తపల్లి, చౌడాపూర్‌, మరికల్‌ తదితర గ్రామాల పరిధిలో చెరువులు నిండాయి. మందిపల్‌లో అంజమ్మ ఇల్లు కొంత భాగం కూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి సహాయం అవసరమైన వెంటనే సంప్రదించాలని కుల్కచర్ల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి సూచించారు.
పూడూరు: పూడూరు మండలం రేగడిమామిడిపల్లి తదితర గ్రామాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. తహసీల్దారు కిరణ్‌కుమార్‌ ఆర్‌ఐ బాల్‌రాజ్‌ ఆధ్వర్యంలో పూడూరు మండల కేంద్రంలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈసీ వాగు మంగళవారం ఉదయం వరకు ఉద్ధృతంగా ప్రవహించింది. మంచన్‌పల్లి, కడ్మూరు సమీపంలోని వాగువద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది.
తాండూరుగ్రామీణ: తాండూరు మండలంలో వందకుపైగా ఎకరాల్లో వరి, కంది, పత్తి పంటలు నీట మునిగాయి. మల్కాపూర్‌, సంగెంకలాన్‌, కొత్లాపూర్‌, గోనూరు, నారాయణ్‌పూర్‌, వీర్‌శెట్టిపల్లి, ఎల్మకన్నె, చెంగెష్‌పూర్‌, అంతారం, చంద్రవంచ, చిట్టిగణాపూర్‌, అంతారం తండా, చెంగోల్‌లో పంటలు వరద తాకిడికి దెబ్బతిన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని