నవజాత శిశువులకు కంటి పరీక్షలు
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

నవజాత శిశువులకు కంటి పరీక్షలు

జిల్లా ఆసుపత్రిలో త్వరలో ప్రారంభం  
పరిశీలించిన వైద్య బృందం

తాండూరు టౌన్‌ (న్యూస్‌టుడే): తాండూరు జిల్లా స్థాయి ఆస్పత్రిలో నవజాత శిశువులకు నేత్ర పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్‌ నుంచి  సేవలను అందుబాటులోకి తేనున్నారు. ఇందులో భాగంగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ విభాగం వైద్యుడు డాక్టరు అనిరుధ్‌, సికింద్రాబాద్‌లోని పుష్పగిరి నేత్ర వైద్యాలయం వైద్యుడు డాక్టరు బాల విద్యాధర్‌  మంగళవారం నవజాత శిశువు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ మల్లికార్జున స్వామితో సమావేశమయ్యారు. ఇక్కడ ఎంత మంది శిశువులు కంటి సమస్యలతో బాధపడుతున్నారు, తీసుకుంటున్న చర్యలేమిటి వంటి పలు అంశాలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడారు. నెలలు నిండకుండా, బరువు తక్కువతో పుట్టే శిశువుల్లో కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని, దాన్ని వెంటనే గుర్తించక పోతే భవిష్యత్తులో శిశువులకు శాశ్వత అంధత్వం వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని