సమష్టిగా వచ్చి.. గండిని పూడ్చి..!
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

సమష్టిగా వచ్చి.. గండిని పూడ్చి..!

ట్టు కాల్వకు గండి పడి వృథాగా వర్షం నీరు పోతుండడంతో గ్రామస్థులందరూ ఏకమై గండిని పూడ్చి, నీటిని చెరువులోకి మళ్లించి ఆదర్శంగా నిలిచారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌లో రెండు రోజుల నుంచి వర్షం దంచికొట్టింది. అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీరంతా స్థానిక పెద్ద చెరువులోకి రావాల్సి ఉండగా కట్టు కాల్వకు గండి పడడంతో నీళ్లు వృథాగా పోతున్నాయి. ఇది గమనించిన సర్పంచి సుకన్య చొరవతో గ్రామస్థులు కలిసి గడ్డపై ఉన్న మట్టిని నీటిలో నుంచి తీసుకెళ్లి గండి పడిన చోట పోసి పూడ్చివేశారు. కాగా కొందరు కావాలనే చెరువులోకి నీరు వెళ్లకుండా గండి కొడుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు. అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

- న్యూస్‌టుడే, తూప్రాన్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని