19 నీటి నిల్వ ప్రాంతాల గుర్తింపు
eenadu telugu news
Published : 29/09/2021 03:58 IST

19 నీటి నిల్వ ప్రాంతాల గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: వరుసగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని 19 ప్రాంతాల్లో కొత్తగా నీళ్లు నిలుస్తున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. గతంలో 35 ప్రాంతాల్లో నీటి నిల్వలు ఇబ్బందులు సృష్టిస్తుండగా.. వీటికి అదనంగా 19 వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, జలమండలి, మైట్రోరైల్‌, ట్రాఫిక్‌, విద్యుత్‌శాఖల అధికారులు సంయుక్తంగా పనులు చేపడితే వర్షం కురిసినా సరే...ట్రాఫిక్‌ ఆగకుండా వెళ్లే అవకాశాలున్నాయి. టోలీచౌకీ, షేక్‌పేట్‌ డీమార్ట్‌, షేక్‌పేట్‌ రత్నదీప్‌, టోలీచౌకీ పైవంతెన కింద, రేతిబౌలి ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోతోంది. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి కోఠి వరకూ, ఎంజీబీఎస్‌ నుంచి రామంతాపూర్‌ వైపు.. అంబర్‌పేట వైపు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలీకేఫ్‌, అంబర్‌పేట ఛేనంబర్‌, మూసారంబాగ్‌, అక్బర్‌ప్లాజాల వద్ద కనీసం అరగంటపాటు నీళ్లు రోడ్డుపై ఉంటున్నాయి. వీటితోపాటు మరికొన్ని గుర్తించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని