అప్పాచెరువు కట్టకు రంధ్రం
eenadu telugu news
Published : 29/09/2021 03:58 IST

అప్పాచెరువు కట్టకు రంధ్రం

బెంగళూరు హైవే మునక

గగన్‌పహాడ్‌ సమీపంలో అప్పా చెరువు నీరు పొర్లుతుండగా.. వెళ్తున్న వాహనాలు

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే కాటేదాన్‌ : నగర శివారులో బెంగళూరు జాతీయ రహదారి పక్కన రాజేంద్రనగర్‌ సమీపంలోని గగన్‌పహాడ్‌లోని అప్పా చెరువుకు గండి పడింది. భారీ వర్షాలకు చెరువుకు మూడు చోట్ల గల్లీలు ఏర్పడి(కోతకు గురై) కట్ట అడుగు భాగంలో రంధ్రాలు ఏర్పడ్డాయి. వీటితోపాటు చెరువు అవుట్‌లెట్‌ నుంచి పెద్దఎత్తున నీరు పొంగింది. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో వరదనీరు బెంగళూరు జాతీయ రహదారిపై పెద్దఎత్తున ముంచెత్తింది. నీటి ఉద్ధృతి గమనించకుండా వెళ్లిన ఆర్టీసీ బస్సు, రెండు లారీలు కూరుకుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులను ఒకే మార్గంలో అనుమతించారు. రోడ్డు పక్కన కాలువ తరహాలో జేసీబీతో ఏర్పాట్లు చేయించారు. ఆ నీటిలో వాహనదారులు వెళ్లారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  అప్పాచెరువును విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఆర్డీవో చంద్రకళ, తహసీల్దారు చంద్రశేఖర్‌తో కలిసి పరిశీలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని