సైబర్‌ సెక్యూరిటీ పెద్ద సవాల్‌
eenadu telugu news
Published : 29/09/2021 03:58 IST

సైబర్‌ సెక్యూరిటీ పెద్ద సవాల్‌

ఏపీఆర్‌ఐజీఎఫ్‌ సదస్సులో జయేష్‌ రంజన్‌

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌ తర్వాత అంతర్జాల వాడకం విఫరీతంగా పెరిగిందని రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ అన్నారు. మంగళవారం ‘ది ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ), ఇంటర్నెట్‌ సొసైటీ-ఇండియా, హైదరాబాద్‌ చాప్టర్‌, ఏషియా పసిఫిక్‌ రీజినల్‌ ఇంటర్నెట్‌ గవర్నెన్స్‌ ఫోరం-లోకల్‌ హబ్‌ హైదరాబాద్‌’’ సంయుక్తాధ్వర్యంలో అంతర్జాల వేదికగా సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథి జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ‘సైబర్‌ సెక్యూరిటీ’ సమాజానికి సవాల్‌గా మారిందన్నారు. ఎన్నో రకాలుగా అమాయక ప్రజలు మోసం పోతున్నారన్నారు. పరిష్కార మార్గాలు అన్వేషించాలని సూచించారు. సదస్సు ప్రారంభకులు ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షులు కె.భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో అంతర్జాల వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉందన్నారు. అప్పేరల్‌ పార్క్‌ సీఈఓ డా.ఎన్‌.జె.రాజారామ్‌ మాట్లాడుతూ.. ప్రజలను సైబర్‌ నేరాల విషయంలో అప్రమత్తం చేయాలన్నారు. ఇంటర్నెట్‌ సొసైటీ-హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షుడు, ఎఫ్‌టీసీసీఐ ఐటీ అండ్‌ ఐటీ ఎనెబల్డ్‌ సర్వీసెస్‌, కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ కమిటీ ఛైర్మన్‌ కె.మోహన్‌రాయుడు అధ్యక్షోపన్యాసం చేస్తూ.. ఐటీ రంగంలో చాలా మంది వద్ద వాడిన ఫోన్లు వృథాగా ఉంటున్నాయని, వాటిని సేకరించి పేద విద్యార్థులకు అందించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. విద్యావేత్త డా.ఎం.ఏ.జబ్బార్‌, ఎఫ్‌టీసీసీఐ సీఈఓ ఖ్యాతి నారవాణే తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని