డ్రైనేజీలో పడి టెకీ మరణించిన ఘటనలో ఏఈ సస్పెన్షన్‌
eenadu telugu news
Published : 29/09/2021 03:55 IST

డ్రైనేజీలో పడి టెకీ మరణించిన ఘటనలో ఏఈ సస్పెన్షన్‌

నార్సింగి న్యూస్‌టుడే: డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో పడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రజినీకాంత్‌ మృతి చెందిన ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్షంగా వ్యవహరించారనే ఆరోపణపై మున్సిపల్‌ ఏఈ ఎన్‌.విఠోబాను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. అదేవిధంగా పనులు జరుగుతున్న ప్రదేశంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్షంగా వ్యవహరించిన కాంట్రాక్టర్‌ రాజ్‌కుమార్‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు మణికొండ మున్సిపల్‌ కమిషనర్‌ జయంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మణికొండ గొల్డెన్‌ టెంపుల్‌ కూడలిలో గత శనివారం రాత్రి వర్షంలో వెళ్తూ ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న డ్రైనేజీలో పడి రాజ్‌కుమార్‌ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.5లక్షలు పరిహారం ప్రకటించింది. అంబర్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ చెక్కు అందజేసేందుకు కుటుంబ సభ్యులను సంప్రదించగా, అంత్యక్రియల్లో ఉన్నట్లు తెలియడంతో బుధవారం అందజేస్తామని జయంత్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని