రంగారెడ్డి జిల్లా కోర్టులకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
eenadu telugu news
Published : 29/09/2021 03:55 IST

రంగారెడ్డి జిల్లా కోర్టులకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: రంగారెడ్డిజిల్లాలో రెండు జూనియర్‌ సివిల్‌ జడ్జీ కోర్టులకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా రెండో అదనపు సివిల్‌ జడ్జి,  సైబరాబాద్‌ రెండో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుతో పాటు అనుబంధంగా ఉన్న జిల్లా బాలల న్యాయమండలి ఛైర్మన్‌గా ఖమ్మంలో పనిచేస్తున్న ఎం.ఉషశ్రీని నియమించింది. అలంపూర్‌లో పనిచేస్తున్న ఎ.రాధికను సైబరాబాద్‌ నాలుగో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌, జిల్లా నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జీగా బదిలీ చేశారు. జిల్లా కోర్టుల భవన సముదాయంలో 12 కోర్టులకు ఒకే మేజిస్ట్రేట్‌ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న విషయాన్ని ఈనెల 25న  ‘పన్నెండు కోర్టులకు ఒకే మేజిస్ట్రేట్‌’ శీర్షికతో ‘ఈనాడు’లో వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో జిల్లాకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఉషశ్రీకి ఒకటో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి(ఒకటో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌), ఐదో జూనియర్‌ సివిల్‌ జడ్జి(ఐదో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌), 8వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి(28వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌) కోర్టులకు,  రాధికకు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి, మూడో జూనియర్‌ సివిల్‌ జడ్జి(మూడో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌), 9వ జూనియర్‌ సివిల్‌ జడ్జి(29వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌) కోర్టులకు  పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇద్దరు కొత్త మేజిస్ట్రేట్లు వస్తుడండంతో  ప్రస్తుతం 12 కోర్టులకు ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న కర్నాటి కవితకు భారం తగ్గి నాలుగు కోర్టులకు పనిచేయనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని