చెరువులో పడి ఇద్దరి మృతి
eenadu telugu news
Published : 18/10/2021 03:58 IST

చెరువులో పడి ఇద్దరి మృతి


అనిల్‌

శామీర్‌పేట, అమీన్‌పూర్‌, న్యూస్‌టుడే: ఈత నేర్చుకునేందుకు వెళ్లి ఓ విద్యార్థి, ప్రమావశాత్తు చెరువులో మునిగి మరొకరు నీట మునిగి మృతి చెందిన ఘటనలు ఆదివారం సాయంత్రం జరిగాయి. శామీర్‌పేట మండలం పెద్దమ్మకాలనీ చెందిన బొలుగుల మల్లేశ్‌-పద్మ దంపతుల పెద్ద కొడుకు అనిల్‌(17) స్థానిక ఐటీఐలో విద్యార్థి. మిత్రుడితో కలిసి శామీర్‌పేట పెద్ద చెరువులో చెరువులో ఈత కొట్టేందుకు దిగి కొద్ది దూరం వెళ్లగానే నీట మునిగిపోయాడు. అమీన్‌పూర్‌ బందంకొమ్ము ప్రాంతంలో ఉండే నర్సింగ్‌(30), పవన్‌(28) మరో ముగ్గురు కలిసి సాయంత్రం నాటు పడవలో చెరువులోకి వెళ్లారు. నర్సింగ్‌, పవన్‌ నీటిలో పడిపోవడంతో మిగతా ముగ్గురు బయటకు వచ్చి స్థానికులకు చెప్పారు. వారు పోలీసులకు సమాచారమిచ్చి గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు. పవన్‌ మృతదేహం లభించగా అర్ధరాత్రి దాకా నర్సింగ్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగాయి. పవన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నర్సింగ్‌ జీహెచ్‌ఎంసీలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది. ఇతనికి 18 నెలల కిందటే పెళ్లి జరిగింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని