విద్యాభివృద్ధికి చేయూత అందించాలి
eenadu telugu news
Published : 18/10/2021 03:58 IST

విద్యాభివృద్ధికి చేయూత అందించాలి


మహిళకు చెక్కు అందజేస్తున్న మేయర్‌ విజయలక్ష్మి

కాచిగూడ, న్యూస్‌టుడే: పేదల విద్యాభివృద్ధికి చేయూత అందించాలని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సూచించారు. ఆర్థిక సాయం అందించడానికి కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఆదివారం కాచిగూడలోని మున్నూరుకాపు సంఘంలో తెలంగాణ మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎంఆర్‌ వెంకట్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కరోనాతో చనిపోయిన వారి పిల్లలు, అనాథలైన 330 మంది విద్యార్థులకు రూ.15 లక్షల చెక్కులను ఆమె పంపిణీ చేశారు. కొవిడ్‌ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు. కార్పొరేటర్‌ సున్నం రాజ్‌మోహన్‌, ట్రస్టీలు గంప చంద్రమోహన్‌, ఆకుల పాండురంగారావు, పన్నాల విష్ణువర్ధన్‌, జెల్లి సిద్ధయ్య, సుంకరి బాలకిషన్‌రావు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని